బెనిఫిట్స్‌ ఇస్తలేరు.. | - | Sakshi
Sakshi News home page

బెనిఫిట్స్‌ ఇస్తలేరు..

Oct 17 2025 6:24 AM | Updated on Oct 17 2025 6:24 AM

బెనిఫిట్స్‌ ఇస్తలేరు..

బెనిఫిట్స్‌ ఇస్తలేరు..

● ఇబ్బందిపడుతున్న ఉమ్మడి జిల్లా విశ్రాంత ఉద్యోగులు ● పీఆర్సీ ఇవ్వడంలో తాత్సారంపై నిరసన ● 2021లో రిటైర్డ్‌ కావాల్సినవారిని మూడేళ్లు పొడగించారు. వారికి మూడేళ్లతో పాటు, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ అందజేయాలి. పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలి. ● గతంలో మాదిరిగానే ఈహెచ్‌ఎస్‌ నిధులు విడుదల చేసి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ వైద్యం అందివ్వాలి. రిటైర్డ్‌ అయిన రోజే గ్రాట్యూటితో పాటు అన్ని బెనిఫిట్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ● జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో విశ్రాంత ఉద్యోగుల భవనాలను ప్రభుత్వం కట్టించాలి.

సమస్యలు వింటలేరు..
● ఇబ్బందిపడుతున్న ఉమ్మడి జిల్లా విశ్రాంత ఉద్యోగులు ● పీఆర్సీ ఇవ్వడంలో తాత్సారంపై నిరసన

‘తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గతేడాది మధ్యలో రిటైర్డ్‌ అయ్యాడు. ఉద్యోగ కాలంలో పోగేసిన, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్‌ రూ. 40 లక్షల నుంచి రూ.50లక్షలు రావాల్సి ఉంది. ఏడాది దాటినా ఆ డబ్బులు అందలేదు. ఉద్యోగంలో ఉండగానే కూతురు పెళ్లి నిశ్చయించుకున్నారు. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌తో ఘనంగా జరుపాలనుకున్న ఆయన ఆశలు తీరలేదు. చేతిలో డబ్బుల్లేక పెళ్లి ఆగిపోయి ఆ కుటుంబమంతా తీవ్ర మానసిన ఆందోళనకు గురయ్యారు’.

‘సిరిసిల్లకు చెందిన ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ గతేడాది రిటైర్డ్‌ అయ్యాడు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ. 40లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండగా సమయానికి అందివ్వలేదు. అనుకోకుండా పక్షవాతానికి గురయ్యాడు. చేతిలో డబ్బు లేక కుటంబ సభ్యులు రూ.4లక్షలు అప్పు చేసి అత్యవసర చికిత్స చేయించగా, ఆ కుటుంబం దీనావస్థలో కాలం వెల్లదీస్తోంది. ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్‌ సకాలంలో అందినా ఈహెచ్‌ఎస్‌ ద్వారా ఆయనకు చికిత్స అంది ఆ కుటుంబ పరిస్థితి వేరేలా ఉండేది’.

సిరిసిల్లటౌన్‌: వారంతా ఒకప్పటి ప్రభుత్వ ఉద్యోగులే. మూడున్నర దశాబ్దాల కాలం పనిచేస్తూ.. గౌరవప్రదమైన జీవితాన్ని గడిపిన వారు. వయస్సు రావడంతో రిటైర్డ్‌ అయి విశ్రాంత ఉద్యోగులుగా ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్‌ ఉద్యోగ విరమణ సమయంలో ఇవ్వడం లేదు. జీవితకాలం కష్టాన్ని ప్రభుత్వం వద్ద వివిధ రూపాల్లో పొదుపు చేసుకుంటే వాటన్నింటికీ గ్రాట్యూటి కలిపి నగదును ప్రభుత్వం అందించాలి. ఇలా ఒకప్పటి విశ్రాంత ఉద్యోగులు పొందిన బెనిఫిట్స్‌ మాదిరిగా ప్రస్తుతం రిటైర్డ్‌ ఉద్యోగులు పొందడం లేదు. వృద్ధాప్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ అందక చెప్పుకోలేని పరిస్థితుల్లో జీవితాలు వెల్లదీస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 25,000 మంది..

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్డ్‌ అయిన వారు, ఫ్యామిలీ పెన్షనర్లు మొత్తం సుమారు 25,000 మంది ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ డబ్బుపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రణాళిక బద్ధంగా వినియోగించుకునే కొంతమంది తమ జీతంపై అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర సంస్థల్లో రుణాలు పొంది ఉన్నారు. ప్రతినెలా మొదటి వారంలో కిస్తులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో నెలలో ఏదైనా కారణాలతో జీతాలు ఆలస్యంగా వస్తే రుణదాతల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఈహెచ్‌ఎస్‌ నిధుల లేమీతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో నగదు పెట్టి చికిత్స చేయించుకున్న వారికి రీయింబర్స్‌మెంట్‌ పొందే అవకాశం ఉండగా, నిధుల్లేక ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్న వారున్నారు.

విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లు

జిల్లాల వారీగా పెన్షనర్లు (సుమారు)

కరీంనగర్‌ 14,000

సిరిసిల్ల 4,200

జగిత్యాల 4,000

పెద్దపల్లి 2,800

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement