డాక్టర్లు మంచిగా చూస్తున్నారా.. | - | Sakshi
Sakshi News home page

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..

Oct 17 2025 6:24 AM | Updated on Oct 17 2025 6:24 AM

డాక్ట

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..

పెద్దపల్లిరూరల్‌: అమ్మా.. ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నయ్‌.. డాక్టర్లు, సిబ్బంది బాగా చూస్తున్నారా.. సౌకర్యాలు ఎలా ఉన్నా యి.. అంటూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, ఆర్‌ఎంవో విజయ్‌కుమార్‌ తదితరుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో గత నెలలో రికార్డు స్థాయి ప్రసూతిసేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉంచాలన్నారు. హాస్పిటల్‌ ఆవరణలో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు.

21 నుంచి అమరవీరుల వారోత్సవాలు

గోదావరిఖని(రామగుండం): రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఈనెల 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ అంబర్‌కిషోర్‌ఝా తెలిపారు. పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా 21 నుంచి 31వరకు ఓపెన్‌హౌస్‌ నిర్వహించి పోలీసు విధులు, వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం, రక్తదాన శిబిర కార్యక్రమాలు, సైకిల్‌ ర్యాలీ, షార్ట్‌ ఫిలిమ్స్‌, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు. పోలీస్‌ రిలేటెడ్‌ అంశం మీద ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిలిం తీయడానికి జిల్లాలో ఆసక్తి గల యువత, ఫొటోగ్రాఫర్లు ముందుకు రావాలన్నారు. షార్ట్‌ ఫిలిం తీసి పంపిస్తే వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.

అంకితభావంతో పనిచేయాలి

కోల్‌సిటీ(రామగుండం): వార్డు ఆఫీసర్లు అంకితభావంతో పని చేయాలని రామగుండం నగరపాలక కమిషనర్‌ జె.అరుణశ్రీ అన్నారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆస్తి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు లక్ష్యం ప్రకారం వసూలు చేయాలన్నారు. భారీ బకాయిలు ఉన్నవారికి రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే, మెటీరియల్‌ స్వాధీనం చేసుకొని జరిమానా విధించాలన్నారు. అదనపు కమిషనర్‌ మారుతిప్రసాద్‌, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌వో ఆంజనేయులు, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, ఆర్‌ఐలు శంకర్‌రావు, ఖాజా పాల్గొన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి

ముత్తారం(మంథని): వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని డీఎంహెచ్‌వో శ్రీవాణి సూచించారు. గురువారం ముత్తారం పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అన్నీ వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. రోజు వారి ఓపీని పరిశీలించారు. వైద్యుడు అమరేందర్‌రావు, సిబ్బంది ఉన్నారు.

అదనపు బాధ్యతలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన డొంకెన రవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు ఫర్‌ ట్రయల్‌ అండ్‌ డిస్పోజల్‌ ఆప్‌ రేప్‌ అండ్‌ పోక్సో యాక్టు కేసులను పరిష్కరించే బాధ్యతలు అప్పగించిందని రవి పేర్కొన్నారు.

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..1
1/3

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..2
2/3

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..3
3/3

డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement