మూడు పంటలకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

మూడు పంటలకు సాగునీరు

Aug 4 2025 5:06 AM | Updated on Aug 4 2025 5:06 AM

మూడు

మూడు పంటలకు సాగునీరు

రామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతలు అందుబాటులోకి రావడంతో ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్గాం మండలం ముర్మూర్‌/బ్రాహ్మణపల్లి శి వారులో రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆదివారం రిమోట్‌ సా యంతో ప్రారంభించారు. ధర్మారంలో రూ. 45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన సముదా యం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త రే షన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ రిగిన సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మా ట్లా డుతూ, మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీ, పంపుహౌస్‌లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, అ యినా, ఒక్కఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. రామగుండం నియోజకవర్గంలో 67 వే ల రేషన్‌కార్డులు ఉంటే.. కొత్తగా 6,500 రేషన్‌కార్డులు జారీచేశామని మంత్రి తెలిపారు.

పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం..

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, అనేక పరిశ్రమలకు నిలయమైన రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి సభ్యులకు ఆర్టీసీ బ స్సు అప్పగించడం ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల మారుపేర్ల సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ బస్సుయాత్ర చేపట్టామన్నారు. ప్రతిపాదనలు పంపిస్తే అంతర్గాంలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం రామగుండం నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలవుతోందన్నారు. ప్రయాణికుల అవసరం మేరకు మరో 16 బస్సులను కేటాయించాలని మక్కాన్‌సింగ్‌ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఎయిర్‌పోర్ట్‌ రాకుంటే..

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మాట్లాడు తూ, అంతర్గాం భూముల్లో ఎయిర్‌పోర్ట్‌ రాకుంటే ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, ఆయన అకాల మృతితో నిర్వాసిత గ్రామాలు, రామగుండం ఉమ్మడి మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం కార్యారూపం దాల్చలేదనే ఠాకూర్‌ గుర్తు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, జిల్లాలో 2.40 లక్షల ఆయకట్టు ఉందని, దీనిని స్థిరీకరించేందుకు పత్తిపాక రిజర్వాయరే ఆధారమన్నారు.

కాందీశీకుల సమస్యలు పరిష్కరించండి..

ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ, బర్మా, శ్రీలంక, కాందీశీకుల భూ ములు, పరిహారం సమస్యలు పరిష్కరించాలని మంత్రులను కోరారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్‌ రవీందర్‌పటేల్‌, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ధర్మపురి ని యోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్‌ నిర్మిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా అమలు చేయలేదని మండిపడ్డారు. ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ విన్నపం మేరకు తమ ప్రభుత్వం లక్ష్మీనర్సింహ రిజర్వాయర్‌ నిర్మాణం డీపీఆర్‌ తయా రీ కోసం రూ.1.10కోట్లు కేటాయించిందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల కోసం బొమ్మారెడ్డిపల్లి – కొత్తపల్లి మైనర్‌ కాలువ పెండింగ్‌ పనుల కోసం రూ.5కోట్లు, మేడారం రిజర్వాయర్‌ నుంచి డీ – 83 బీ లింక్‌ కెనాల్‌ పనుల పూర్తికి రూ.3. 26 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు లావుడ్య రూప్లానాయక్‌, భీమ సంతోష్‌, బుర్ర రాములుగౌడ్‌, లక్ష్మణ్‌ లావణ్య, సివిల్‌ సప్లయ్‌ ఎండీ చౌహన్‌, అదనపు కలెక్టర్‌ వేణు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

రామగుండాన్ని పరిశ్రమల కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం

అంతర్గాంలో గోదాములు నిర్మిస్తాం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభయం

రామగుండం ఎత్తిపోతల ప్రారంభం

ధర్మారంలో రేషన్‌కార్డులు పంపిణీ

హాజరైన మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్‌

మూడు పంటలకు సాగునీరు1
1/2

మూడు పంటలకు సాగునీరు

మూడు పంటలకు సాగునీరు2
2/2

మూడు పంటలకు సాగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement