
మల్లన్నకు బోనం మొక్కులు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓదెల మల్లన్నను దర్శించుకున్నారు. స్వామివారికి పట్నాలు వేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆర్యవైశ్యుల వన భోజనాలు
ఎలిగేడు: రాములపల్లి(ర్యాకల్‌దేవుపల్లి) నాగలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలతోపాటు స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తొలుత ప్రత్యేకపూజలు చేశారు. పూజారి అభిషేక్‌శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకట్ నారాయణ, మంచాల జ్యోతి, కోలేటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజీడీకేఎస్ డివిజన్ కార్యవర్గం
సుల్తానాబాద్(పెద్దపల్లి): భారతీయ గ్రామీణ డాక్ కర్మచారి సంఘ్ పెద్దపల్లి డివిజన్ అధ్యక్షుడిగా ఎన్.మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో ఆదివారం సర్కిల్ కార్యదర్శి వినయ్ సుధీర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీ ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యా రు. కార్యదర్శిగా ఎం.సమ్మయ్య, కోశాధికారిగా కె.శ్రావణ్ కుమార్, డిప్యూటీ కార్యదర్శిగా బి.హరిహరన్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 99 మంది విద్యార్థులకు 87 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. రామగిరి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

మల్లన్నకు బోనం మొక్కులు

మల్లన్నకు బోనం మొక్కులు