స్టేడియం నిర్మాణానికి నిధులు | - | Sakshi
Sakshi News home page

స్టేడియం నిర్మాణానికి నిధులు

Aug 4 2025 5:06 AM | Updated on Aug 4 2025 5:06 AM

స్టేడ

స్టేడియం నిర్మాణానికి నిధులు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.30కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థా నిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో స్టేడియం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చూస్తామని ఆయన అన్నారు. నాయకులు కొట్టె సదానందం, లకిడి భాస్కర్‌, నూగిల్ల మల్లయ్య, సరోత్తంరెడ్డి తదితరులు ఉన్నారు.

అప్పుల్లో ఉన్నా పథకాలు అమలు

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే ప్రజలపై భారం పడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘ నత కాంగ్రెస్‌ సర్కారుకే దక్కిందని ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. రెబ్బల్‌దేవ్‌పల్లి, చిన్నబొంకూర్‌, మియ్యాపూర్‌ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోసి మాట్లాడారు. జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, నా యకులు పన్నాల రాములు, సాగర్‌ ఉన్నారు.

మొక్కలు నాటిన ‘హర్కర’

రామగుండం: అంతర్గాం మండల పరిషత్‌ కా ర్యాలయ ఆవరణలో ఆదివారం వనమహోత్స వం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు హర్కర వేణుగోపాల్‌రావు, జిల్లా అటవీశా ఖ అధికారి శివయ్య, ఎంపీడీవో వేణుమాధవ్‌ తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల పరి షత్‌ సూపరింటెండెంట్‌ కరుణాకర్‌, అధికారు లు కొమురయ్య, రమేశ్‌, ఇర్షద్‌బేగ్‌, రవంతి, లీల తదితరులు పాల్గొన్నారు.

యూరియా ఉత్పత్తి ప్రారంభం

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఎ రువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రా రంభమైంది. కర్మాగారం అమ్మోనియా పైప్‌లై న్‌ లీక్‌ కావడంతో జూలై 16న ప్లాంట్‌ షట్‌డౌన్‌ చేసిన విషయం విదితమే. మరమ్మతులు అనంతరం శుక్రవారం ప్లాంట్‌ ప్రారంభం కాగా ఆది వారం యూరియా ఉత్పత్తి పునరుద్ధరించారు. కర్మాగారం యూరియా ఉత్పత్తి సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్‌ టన్నులు. వార్షిక మరమ్మతులు, హెచ్‌టీఆర్‌ మార్పుతో సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి చేయలేకపోతున్నారు.

రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక

సుల్తానాబాద్‌/ఎలిగేడు/కాల్వశ్రీరాంపూర్‌: బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఈనెల 5న జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు కర్రె సంజీవరెడ్డి, కంకణాల జ్యోతిబసు, ముక్కోజు వెంకటేశ్వర్లు, చాతరాజు రమేశ్‌ తెలిపారు. ఆదివారం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రా ష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన రామచంద్రారావు తొలిసారి జిల్లాకు వస్తున్నందున పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నా యకులు గాదె రంజిత్‌రెడ్డి, అడ్డ గుంట తిరుపతిగౌడ్‌, గుజ్జుల మల్లారెడ్డి, గోపు సురేందర్‌రెడ్డి, రాయపాక మనోహర్‌, మల్లారపు అంజయ్య, గంగయ్య, చౌదరి తిరుపతి, బత్తిని శ్రీనివాస్‌, రవి, కోడూరి శ్రీనివాస్‌, రాజేందర్‌, సతీశ్‌రెడ్డి, భోగె కిరణ్‌, ఎడ్ల సతీశ్‌ పాల్గొన్నారు.

పనుల్లో వేగం పెంచండి

గోదావరిఖని: సింగరేణి చేపట్టిన ర్యాపిడ్‌ గ్రా విటీ నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూ ర్తిచేయాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్జీ– వన్‌ ఏరియా లో జీడీకే–1వ గని ఫ్యాన్‌హౌస్‌ వద్ద చేపట్టిన ర్యాపిడ్‌ గ్రావిటీ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. కార్మి క కుటుంబాలకు నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తాము పోరాటం చేశామని, దీంతోనే సింగరేణి రూ.20కోట్లతో ర్యాపిడ్‌ గ్రావిటీ పనులు చేపట్టిందన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని దీనిని త్వరగా అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. నాయకులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్‌, ఆసరి మహేశ్‌, దాసరి సురేశ్‌, అనబోయిన శంకర్‌, సానం రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరుమళ్ల శ్రీనివాస్‌, తిప్పారపు రాజు, జనార్దన్‌రెడ్డి, పెద్దపల్లి శశికుమార్‌, రాజ్‌కుమార్‌, శివరామకృష్ణ, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

స్టేడియం నిర్మాణానికి నిధులు1
1/2

స్టేడియం నిర్మాణానికి నిధులు

స్టేడియం నిర్మాణానికి నిధులు2
2/2

స్టేడియం నిర్మాణానికి నిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement