
‘కిసాన్’ సంబురం
● రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం ● ఒక్కో అన్నదాత అకౌంట్‌లో రూ.2వేల చొప్పున జమ
సుల్తానాబాద్(పెద్దపల్లి): చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈఏడాది తొలివిడతలో నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి రూ.2వేల చొప్పున జమచేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా మూడు విడతల్లో (నాలుగు నెలలకోసారి) రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్ర ప్రభు త్వం గతంలోనే ప్రకటించింది. అయితే, ఈసారి వచ్చిన తొలివిడత డబ్బులు వరినాట్లకు ఉపయోగపడతాయని రైతులు భావిస్తున్నారు.
జిల్లాలో తగ్గిన రైతుల సంఖ్య..
జిల్లావ్యాప్తంగా 73,400 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి కిసాన్ సమ్మాన్ నిధు లు జమచేస్తున్నారు. మొత్తం 82,219 మంది రైతులు ఉంటే.. అందులో 73,400 మందిని అర్హులుగా గుర్తించారు. ఐదెకరాల్లోపు వ్యవసా య భూమి గల చిన్న, సన్నకారు రైతులు పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 82,219 మంది రైతులకు 73,400 మందిని అర్హులుగా గుర్తించగా, మిగిలినవారి బ్యాంకు ఖాతా లు, ఆధార్ వివరాల్లో పొరపాట్లు ఉండడంతో అ నర్హులుగా తేలారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివారి వివరాలు సక్రమంగా ఉంటే తమ కు అందజేయాలని, తద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని వారు పేర్కొంటున్నారు.
వివరాలు అందిస్తే అప్‌లోడ్ చేస్తాం
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తొలివిడత నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 73,400 మంది బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి జమచేస్తున్నారు. నిధులు జమకానివారు బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ వివరాలు మాకు సమర్పించండి. ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం.
– శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి

‘కిసాన్’ సంబురం