కరెంట్‌ షాక్‌తో విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ షాక్‌తో విద్యార్థి

Published Fri, Jun 21 2024 11:58 PM | Last Updated on Fri, Jun 21 2024 11:58 PM

కరెంట్‌ షాక్‌తో విద్యార్థి

మంథని: మున్సిపల్‌ పరిధిలోని పోచమ్మవాడలో బుద్దార్థి వర్షిత్‌(18) అనే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి శుక్రవారం కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నవీన్‌ కుమారుడు వర్షిత్‌. ఓ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. నవీన్‌ ఇటీవల తన ఇంటి ఎదుట ఒక గది నిర్మించాడు. లోపలి కరెంట్‌ మీటర్‌ను బయట అమర్చేందుకు ఓ ఎలక్ట్రీషియన్‌తో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో కరెంట్‌ మీటర్‌ సర్వీస్‌ వైరు ఇంటి గోడ మధ్యలో ఉంది. దానిని వర్షిత్‌ బయటకు లాగేస్తున్నాడు. నవీన్‌ ఇంట్లో నుంచి బయటకు ఈ వైర్‌ తోస్తున్నాడు. ఈక్రమంలో వైరు తెగి హర్షిత్‌ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వర్షిత్‌ను స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నవీన్‌ ఏకై క కుమారుడు కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement