వేడుకగా సంస్కృత సప్తాహ మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా సంస్కృత సప్తాహ మహోత్సవం

Aug 26 2026 1:00 AM | Updated on Aug 26 2026 1:00 AM

విజయనగరం టౌన్‌/క్రైమ్‌: తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో మంగళవారం సాయంత్రం సంస్కృత సప్తాహ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పిటిజివి.రంగాచార్యులు మాట్లాడుతూ తెలుగు, సంస్కృతం ఆత్మ పరమాత్మ వంటివని, ఒకటి పందిరి అయితే మరొకటి మల్లెతీగని, వాటిని గౌరవించుకోవడం, కాపాడుకోవడం భావితరాలకు ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌, భాస్కరరావు, సంతోష్‌ లక్ష్మి, వి.యామిని, సత్యపావని, ధవళ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement