గుడ్లు సరఫరాలో మతలబు! | - | Sakshi
Sakshi News home page

గుడ్లు సరఫరాలో మతలబు!

Aug 26 2026 1:00 AM | Updated on Aug 26 2026 1:00 AM

విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం విషయంలో చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా లబ్ధిదారులకు పౌష్టికాహారం పూర్తి స్థాయిలో అందకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న సైజు గుడ్లు సరఫరా అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిచ్చిక గుడ్లు లాంటి గుడ్లు సరఫరా చేస్తున్నా.. చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు అఽధికారులు పర్యవేక్షణలో జరగాలి. ఎక్కడైనా నాణ్యత లేకపోయినా, పాడైనా, చిన్న సైజు సరఫరా అయినా వాటిని తిప్పి పంపాలి. కానీ ఆ విధంగా చేయడం లేదు. కాంట్రాక్టర్‌ వేటిని సరఫరా చేస్తే వాటినే తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 292 మిని అంగన్‌వాడీ కేంద్రాలు, 2207 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 71,53 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో బాలింతలు 6769 మంది, గర్భిణులు 7799 మంది, 0 నుంచి 6 నెలలలోపు పిల్లలు 6203 మంది, 6 నెలలు నుంచి మూడేళ్లలోపు పిల్లలు 36,389 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 15,493 మంది ఉన్నారు.

ప్రతీ రోజు పిల్లలకు గుడ్డు పెట్టాలి

అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలకు సెలవు రోజు మినహా ప్రతీ రోజు గుడ్డు ఇవ్వాలి. గర్భిణులు, బాలింతలకు నెలకు ఒక్కొక్కరికి 25 గుడ్లు చొప్పున అందిస్తారు. గుడ్డు పరిమాణం 50 గ్రాములు ఉండాలి. కానీ అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లు 40 నుంచి 45 గ్రాములు అధిక శాతం గుడ్లు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులోనూ కొన్ని కుళ్లిన గుడ్లు కూడా ఉంటున్నాయి.

చిన్న సైజు గుడ్డు

50 గ్రాములు ఉండాలి..

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ప్రతీ గుడ్డు 50 గ్రాములు ఉండాలి. 30 గుడ్లు 1500 గ్రాములు ఉండాలి. చిన్న సైజు గుడ్లు సరఫరా అయిన కేంద్రాల్లో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

– కేవీ బాలామణి, పీడీ, ఐసీడీఎస్‌

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న సైజు గుడ్లు

చోద్యం చూస్తున్న అధికారులు

జిల్లాలో 2499 అంగన్‌వాడీ

కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement