సాక్షి, పార్వతీపురం మన్యం: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘అమరావతి చాంపియన్‌షిప్ 2.0’ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు తిరుపతి వేదికగా జరగనున్నాయి. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఈ పోటీలు జరగగా.. అండర్–17, అండర్–23 బాలబాలి కల కేటగిరీలలో క్రీడాకారులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రతిభ చాటిన యువ క్రీడాకారులు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ధ్యాన్ చాంద్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు అధికార యంత్రాంగం నుంచి సహకారం కొరవడుతోంది. మొత్తం 12 క్రీడాంశాల్లో జరిగే ఈ పోటీల్లో ఒక్కో జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు, పీఈటీలు, పీడీలు హాజరవుతున్నారు. ప్రయాణ ఖర్చుల కోసం ఒక వైపు ఒకరికి రూ.500, మార్గమధ్యంలో భోజనం కోసం రూ.300 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లాకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. మన్యం జిల్లా లో క్రీడాకారులను తరలించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటి వరకూ పైసా కూడా ఇవ్వలేదు. వెళ్లి వచ్చాక ఇస్తాంలే అని చెబుతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో దీనికి సంబంధించి ఇప్పటికే రూ.6 లక్షల వర కూ డ్రా చేసుకున్నట్లు సమాచారం. అక్కడ లేని ది ఇక్కడే ఎందుకు ఇబ్బంది వస్తోందని పలువురు పీఈటీలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా స్థాయి పోటీల సమయంలో జరిగిన ఖర్చుల డబ్బులు కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదని, చేతి సొమ్ము పెట్టుకున్నామని వాపోతున్నారు. పోటీలు దగ్గరకు వస్తున్నా..క్రీడాకారుల తరలింపునకు బస్సులు కూడా పెట్టనట్లు తెలుస్తోంది.
సాలూరు: రాష్ట్ర సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి మాజీ పీఎస్ బందాపు సతీష్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు శుక్రవారం విచారణ జరిపారు. అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, పట్టణ సీఐ అప్పలనాయు డు భంజ్‌దేవ్ ఇంటికి వెళ్లి ఆయన వాంగ్మూలా న్ని రికార్డు చేశారు. సతీష్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి భంజ్‌దేవ్‌తో పాటు పలువురు కారణమంటూ సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెట్టిన క్రమంలో ఇది రాజకీయ దుమారాన్ని రేపింది. తనపై రాజకీయంగా కుట్రపన్ని, ఇలా సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టారంటూ ఈనెల 13న ఎస్పీకి భంజ్‌దేవ్ ఫిర్యాదు చేశారు.
పార్వతీపురం: మానవ మేధస్సుతో పోటీ పడు తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవ సాయ రంగంలోనూ తనదైన శైలిలో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తోంది. యాంత్రీకరణ గా మారిన వ్యవసాయ రంగాన్ని మరింతగా ఆధునిక పుంతలు తొక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ విస్తార్’ పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ ద్వారా కేవలం సలహాలు, సూచనలు మాత్ర మే కాకుండా విత్తనాలు, సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు, మద్దతు ధర, మార్కెట్ సౌకర్యాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ప్రాంతీయ భాషలో అర్దమయ్యే రీతిలో ఏఐ సలహాలు, సూచనలు అందిస్తుండడం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ యాప్‌లో చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తే ఒక్క ఫొటో తీసిపంపిస్తే దానికి ఆశించిన తెగులు ఏమిటి, ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి తదితర సమాచారాన్ని అందిస్తుంది. పంట సాగు పద్ధతులే కాకుండా వాతావరణ సమాచారం కూడా అందజేస్తుంది.


