సాలూరు: మండలంలోని మామిడిపల్లి,కురుకుట్టి గ్రామాలకు సంబంధించి పోలింగ్‌స్టేషన్లు 24,6 పరిధిలోని ఎస్‌ఆఐర్ నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీ కేసులపై ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ విచారణను తహసీల్దార్ సురేష్ గురువారం నిర్వహించారు. ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలు, నమోదైన అ భ్యంతరాలు, నో మ్యాపింగ్,లాజికల్ డిస్క్రెపెన్సీకి సంబంధించిన అంశాలను పరిశీలించారు. ధ్రువీకరణ పత్రాలను స్వీకరించి నిబంధనల మేరకు పరిశీలించారు. అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించే విధంగా విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో బీఎల్‌ఒలు, ఓటర్లు , ప్రజలు పాల్గొన్నారు.


