పార్వతీపురం: జిల్లాలో రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాసింజర్స్ వెవెల్ఫేర్, కన్జూమర్స్ అవేర్‌నెస్ సొసైటీ సభ్యులు దక్షిణ కోస్తా రైల్వే ఉన్నతాధికారులకు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, కోచ్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. విజయనగరం– రాయగడ మధ్య మెము సర్వీస్, పార్వతీపురం నుంచి సికింద్రాబాద్, బెంగుళూర్, తిరుపతికి నేరుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేశారు. 18301/18302 సంబల్‌పూర్ ఇంటర్ సిటీని విజయనగరం వరకు పొడిగించడం, రాయగడ– విజయనగరం మార్గంలోని అన్ని రైళ్లకు పార్వతీపురంలో స్టాపేజ్ కల్పించడం, ఆర్‌వీ/ 283 వద్ద ఆర్‌ఓబీ లేదా అండర్‌పాస్ నిర్మించడం, పండగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు. 18523/ 18524 రీల్‌ను వారానికి ఐదురోజులు నడపాలని, చీపురుపల్లిలో 19021/19022 రైళ్లకు హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వి. శ్రీహరితోపాటు వి. సందీప్, ఎం. కృష్ణమూర్తినాయుడు, ఎం. వెంకటరమణ, ఎం. రామచంద్రరావు తదితరులున్నారు.


