సీతానగరం: మండలంలోని జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(ఎస్‌ఓఈ) విద్యాలయంలో విద్యార్థులకు వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ ఎంఎం రవికుమార్‌రెడ్డి పీహెచ్‌సీ డాక్టర్ పి.పావని ఆధ్వర్యంలో గురువారం దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ విద్యపట్ల దీక్షతో ఉన్న సమయంలో దోమలు కుట్టే అవకాశం ఉందని జ్వరాల బారినపడతారని తద్వారా దోమల బారినుంచి రక్షించుకునేందుకు దోమతెరలు దోహద పడతాయని అందుకు 177 మంది విద్యార్ధులకు దోమతెరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆరోగ్యపరమైన విషయాలపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత, చేతులు శుభ్రపర్చుకోవడం, కాలానుగుణంగా వచ్చే వ్యాధులపట్ల తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఓఈ ప్రిన్సిపాల్ ధర్మరాజు, హెల్త్ సూపర్‌వైజర్ గోపాల నాయుడు, ఉప ఎంఎల్‌హెచ్‌పీలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


