పాచిపెంట: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన విశాలాంధ్ర విలేకరి గోవిందపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పాచిపెంట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్ వి.రంగారావుకు వినతిపత్రం అందజేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సంయుక్త కార్యదర్శి పి.ఉమామహేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వై.గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


