● మహిళలను కించపరిచేలా ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు
● ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులు పేరిట.. చెత్త పలుకులు పలుకుతున్నారని.. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ తన పైత్యాన్ని పత్రికలో వదిలి పాఠకులపై రుద్దుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా.. సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో గురువారం ఫిర్యాదు చేశారు.


