గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీ శంబుగూడ గ్రామంలోని పాఠశాల భవనం పైకప్పు రేకులు ఇటీవల వీచిన ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. వాటిని తిరిగి అమర్చేవారే కరువయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం ఊరిబడిని కనీసం పట్టించుకోవడం లేదు. చేసేదిలేక ఇదిగో ఇలా చెట్టునీడన విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధన చేస్తున్నారు. వర్షం కురిస్తే బడికి సెలవు ఇస్తున్నారు. ఇంటి గడపన, చెట్టు నీడన సక్రమంగా చదువులు సాగడం లేదని, తక్షణమే భవన సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
– గుమ్మలక్ష్మీపురం


