మన్యం కలెక్టర్‌ వివక్ష చూపుతున్నారు | - | Sakshi
Sakshi News home page

మన్యం కలెక్టర్‌ వివక్ష చూపుతున్నారు

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

మన్యం కలెక్టర్‌ వివక్ష చూపుతున్నారు

స్పందించకపోతే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా

అరకు ఎంపీ డాక్టర్‌ తనూజారాణి ఆవేదన

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంపీ ల్యాడ్స్‌ నుంచి 2024 సెప్టెంబర్‌ నుంచి 40 అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నా కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అనుమతులు ఇవ్వడం లేదని, దీంతో ఒక్క పని ముందుకు సాగడం లేదని, ఆయన ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి నాపై వివక్ష చూపుతున్నారని ఎంపీ డాక్టర్‌ తనూజారాణి సభలో ప్రస్తావించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి అభివృద్ధిని అడ్డుకోవడం తగదన్నారు. ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని చిన్నచూపు చూస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇదే ఒరవడి కొనసాగితే కలెక్టర్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్‌మోషన్‌ అందిస్తానని స్పష్టంచేశారు. దీనిపై జెడ్పీ చైర్మన్‌ మన్యం కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని అడగ్గా వివక్ష అంటూ ఏమీ లేదని, ఎంపీ సూచించిన పనులను కొద్దిరోజుల్లో ప్రారంబిస్తామని తెలిపారు. పనుల ప్రారంభానికి కచ్చితమైన సమయం, తేదీ చెప్పాలని, ఆ రోజున తనతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీ సీఈఓ హాజరవుతామని జెడ్పీ చైర్మన్‌ తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో సభలో చర్చించిన అంశాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జేసీ సేతుమాధవన్‌, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement