ఈ చిత్రం చూశారా... కొమరాడ మండలం కళ్లికోట గ్రామ సమీపంలోని నాగవళి నదీతీరంలో సాగుతున్న ఇసుక తవ్వకాలు ఇవి. ఇక్కడ ఇసుక తవ్వేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. అధికారికంగా ఇసుక ర్యాంపు కూడా లేదు. రాత్రీపగలు తేడా లేకుండా ఇసుకను తవ్వేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఒక్కోట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ.5వేలకు పట్టణాల్లో విక్రయిస్తున్నారు. తీరాన్ని తవ్వేస్తుండడంతో వరదలు వచ్చే సమయంలో ముంపు అవకాశం ఉందంటూ కళ్లికోట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు. – కొమరాడ


