21 స్కాలర్‌షిప్‌లు రావడం జిల్లాకే గర్వకారణం | - | Sakshi
Sakshi News home page

21 స్కాలర్‌షిప్‌లు రావడం జిల్లాకే గర్వకారణం

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

21 స్కాలర్‌షిప్‌లు రావడం జిల్లాకే గర్వకారణం

విజయనగరం టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ విజయవాడకు కేటాయించిన 40 స్కాలర్‌షిప్‌లలో 21 స్కాలర్‌షిప్‌లు విజయనగరం డివిజన్‌కు రావడం గర్వకారణమని పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాసు పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు 12న తపాలా శాఖ నిర్వహించిన దీన్‌ దయాల్‌ స్పర్శ యోజన ఫిలాటలీ ప్రతిభా పరీక్షలో విజయనగరం విద్యార్థులు సత్తా చాటారు. గురువారం హెడ్‌పోస్టాఫీస్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో రూ.6వేలు నగదు స్కాలర్‌షిప్‌, మెరిట్‌ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి తపాలా శాఖ అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జివి.రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement