విజయనగరం క్రైమ్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో బెట్టింగ్‌రాయుళ్లపై సీఐ చౌదరి తన బృందంతో గురువారం దాడులు చేశారు. రామానాయుడు రోడ్డు బిక్కవోలు వీధిలో బెట్టింగులు కడుతున్న యువత వాడుతున్న సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు పది మంది యువత వీధిలో సెల్‌ఫోన్ ద్వారా బెట్టింగులు ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ ప్రసన్నకుమార్, కానిస్టేబుళ్లు నాయుడు, రమణలతో గుర్తించారు. క్రికెట్ బెట్టింగులు చట్టవిరుద్ధమని, బెట్టింగ్‌లతో డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించి పంపించారు.


