● ముద్దలా అయిపోయిన మాత్రలు
విజయనగరం ఫోర్ట్: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన మందులు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద ప్రజలకు ఏ జబ్బు చేసినా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు. అలాంటి పేదలకు టీడీపీ ప్రభుత్వం నాణ్యత లేని మందులు ఇస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీపీ రోగులకు ఇచ్చే టెల్మా, ఎమ్లాడోఫిన్ మాత్రలు నాణ్యత లేనివిగా ఉన్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్ట్రిప్ తీయగానే అందులో మాత్రలు ముద్దలా కావడంతో అవాక్కవ్వడం రోగుల వంతైంది. వాటి కాలపరిమితి డిసెంబర్ 2027 వరకు ఉంది. అయినప్పటకీ మాత్రలు ముద్దలా కావడం గమనర్హాం.


