చీపురుపల్లి: జిల్లా స్థాయిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూరల్ మైండ్‌సెట్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఏపీ ఈఎమ్‌డీపీ) ఎక్స్‌పో–2026లో చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. విజయనగరంలోని కస్పా హైస్కూల్‌లో మంగళవారం జరిగిన ఏపీ ఈఎమ్‌డీపీ ఎక్స్‌పోలో చీపురుపల్లి బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన ప్రాజెక్టు జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎక్స్‌పోకు ఎంపికై ంది. దీంతో ప్రాజెక్టు తయారు చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థినిలను పాఠశాల హెచ్‌ఎం రెహేనా బేగం బుధవారం అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికు ఎంపికై న ప్రాజెక్టు ప్రదర్శనలో విద్యార్థినిలు కె.లిఖిత స్వరాజ్, సీహెచ్ మనశ్విని, వి.అమృత వర్షిణి ఉండగా గైడ్ టీచర్లుగా రమాదేవి, అనూరాధ, స్వర్ణకుమారి వ్యవహరించారు.


