విజయనగరం అర్బన్: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలు మందగమనంలోనే కొనసాగుతున్నాయని సమస్యలు పేరుకుపోతున్న నేపథ్యంలో వేగవంతం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహంచిన సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీలో ఇంకా లోపాలు కొనసాగుతుండటం, రీ సర్వే పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు గుర్తించారు. మ్యుటేషన్లు కూడా ఆలస్యంగా పూర్తవుతున్నాయిని, పలుచోట్ల ఫిర్యాదులు పెరుగుతున్న దృష్ట్యా సంబంధిత ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఒక్క తప్పు కూడా లేకుండా పాసుపుస్తకాలు ఇవ్వాలని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతుండడంపై జేసీ సమీక్షించారు. గ్యాస్ సరఫరాపై కూడా సమీక్షించారు. జిల్లాలోనే గ్యాస్ వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
13న అప్రెంటీస్ మేళా
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన ప్రధానిమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ టీవీ గిరి తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మేళాకు మ్యాట్రిక్స్ లేబొరేటరీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, జయభేరి ఆటోమోటివ్ లిమిటెడ్, శ్యాంసంగ్ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఐఎఫ్‌బీ సర్వీస్ సెంటర్, వోల్టాస్ ఆథరైజ్జ్ సర్వీస్ సెంటర్, ఎల్జీ, రేడియంట్ ఎలక్ట్రానిక్స్ క్యుసివ్ టెక్సాలజి హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. మేళాలో పాల్గొన్న అభ్యర్థులను ఆయా కంపెనీలు ఎంపిక చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్‌తో అప్రెంటిస్ అవకాశాలు కల్పించనున్నట్టు జిల్లా కన్వీనర్ వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు ఫొటోలతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు. వివరాల కోసం 9441518355, 9703179119 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ఉపాధి పనుల పరిశీలన
● వేగవంతం చేయండి..: జేసీ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధిలో చేపడుతున్న ఉపాధి హా మీ పనులను డ్వామా పీడీ ఎస్.శారదాదేవి బుధవారం పరిశీలించారు.ఈసందర్భంగా వేతనదారులకు ఆమె పలుసూచనలు చేశారు.రోజూ రెండు పూటలా పనులకు హాజరు కావాలని, 125 రోజుల పనిదినాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన దినసరి గరిష్ట వేతనం రూ.307 అందుతుందన్నారు.పని ప్రదేశాల్లో వేతనదారులకు నీడ, తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆమె వెంట ఏపీఓ రామారావు ఉన్నారు.


