బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు యత్నం | - | Sakshi
Sakshi News home page

బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు యత్నం

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు యత్నం

ప్రతిఘటించిన మహిళపై కర్రతో దాడి

అడ్డుకోబోయిన మరో మహిళపై కూడా అగంతుకుడి దాడి

బొండపల్లి: ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసి బంగారు ఆభరణాలను దోచుకోని వెళ్లేందుకు ప్రయత్నించి మహిళ ప్రతిఘటించడంతో తలపై కర్రతో బలంగా కొట్టి గుర్తు తెలియని అగంతుకుడు ఉడాయించిన సంఘటన మండల కేంద్రమైన బొండపల్లిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి ఎస్‌ఐ తెలిపిన వివరాలు... బొండపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 26కు అనుకోని పెట్రోలు బంకుకు ఎదురుగా ఉన్న ఇంట్లో మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో గుర్తు తెలియని ఒక అంగతుకుడు మాస్క్‌ వేసుకోని వచ్చి బాత్‌రూంకు వెళ్లడానికి వచ్చిన కిలపర్తి రామలక్ష్మిపై కర్రతో తలపై బలంగా కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోని వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న చలుమూరి సత్యవతి బయటకు రాగా ఆమె అగంతుకుడుని చీపురుతో కోట్టే ప్రయత్నం చేయగా సత్యవ తి చేతులు, కాళ్లుపై కర్రతో దాడి చేసి అక్కడ నుంచి గోడ దూకి పరారయ్యాడు. రామలక్ష్మి మెడలో బంగారు చైనును లాక్కోనే ప్రయత్నంలో తెగి పడి చైను ఆమె జాకెట్టులో పడటంతో పాటు సత్యవతి కూడా పెనుగులాటలో అంగతుకుడు అక్కడ నుంచి గోడ దూకి పరారీ అయినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రామలక్ష్మిని 108 వాహనంలో గజపతినగరంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రసుత్తం ఆమె పరిస్థితి బాగానే ఉంది. ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది, క్లూస్‌ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement