గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీ వాస్తవ చొరవతో జీసీసీ డీఎం కిలో చింతపండును రూ.55లు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నట్టు గుమ్మలక్ష్మీపురం జీసీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.రాము పేర్కొన్నారు. మండలంలోని గుల్లలంక గ్రామంలోని గిరిజనుల నుంచి పెంచిన ధరతో చింతపండును జీసీఎంఎస్ మేనేజర్ సహా, సీసీపీఏలు మంగళవారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభంలో కిలో చింత పండు రూ.36 ఉండేదని, మధ్యలో ఆ ధరను రూ.45కు పెంచామని, ఈ ఏడాది చింతపండు దిగుబడి తగ్గటంతో గిరిజనులకు మద్దతు ధర కల్పించేందుకు రూ.55కు పెంచామన్నారు. జీసీఎంఎస్ కల్పిస్తున్న ధరను సద్వినియోగం చేసుకుంటూనే.. జీసీసీ వ్యాపారాభివృధ్ధికి తోడ్పాటునందించేందుకు చింతపండును తమకే విక్రయించాలని మేనేజర్ రాము గిరిజనులను కోరారు.


