విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పోషకాహారం తీసుకుంటూ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలన్నారు. ప్రతి రోజు వ్యాయమం, సరైన ఆహారం, సరైన నిద్ర తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ డాక్టర్ రాణి, డీపీహెచ్‌ఎన్‌ఓ వి.శాంతి, డెమో వి.చిన్నతల్లి, ఎస్‌ఓ గిరిగణేష్ తదితరులు పాల్గొన్నారు.
జీవనశైలి ఆరోగ్య సమస్యలకు కారణం
జీవనశైలి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమని సుఖీభవ ఆస్పత్రి ఎం.డి డాక్టర్ పి.ఎస్.వి.రామారా వు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన సదస్సు లో ఆయన మాట్లాడుతూ ప్రతీ రోజు ధ్యానం, యో గ, వ్యాయమం ఏదో ఒకటి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు.


