విధి నిర్వహణలో అలసత్వం వద్దు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో అలసత్వం వద్దు : కలెక్టర్‌

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

సాలూరు: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలో పెదకోమటిపేట సచివాలయాన్ని్‌, జాయింట్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ఉద్యోగులు అటెండెన్స్‌, రిజిస్టర్‌ల నిర్వహణ, అందిస్తున్న సర్వీసులు, సర్వేల ప్రగతి తదితర అంశాలపై ఆరా తీశారు. ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని సూచించారు. వాట్సాప్‌ మనమిత్రపై ప్రజలకు అవగాహన పెంపొదించాలన్నారు. వాట్సాప్‌ మనమిత్ర ద్వారా సర్వీసులను రిజిస్టర్‌ నేరుగా చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement