● జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత
అధికారిణి బాలామణి
విజయనగరం ఫోర్ట్: బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కె.వి.బాలామణి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం బేటీబచావో, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, వారి భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడతాయన్నారు. దీనివల్ల బాలికలు తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలకు గురవుతారన్నారు. సమాజంలో ఎక్కడైనా బాల్య వివా హాలు జరిగినా.. అసాంఘిక కార్యక్రమాలు జరిగినా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిమ్మలపాడు పరిసరాల్లో ఏనుగుల సంచారం
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పాత నిమ్మలపాడు నిర్వాసిత గ్రామం సమీపంలో ఏనుగుల గుంపు సంచరించడంతో అటువైపుగా వెళ్లాల్సిన తొడుము, రాయిపురం, మాదలంగి గ్రామాలకు వెళ్లే వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం గిజబ, బాసంగి గ్రామాల పంట పొలాల్లో సంచరించిన గజరాజులు సాయంత్రానికి నిమ్మలపాడుకు చేరుకున్నాయి. రాత్రికి ఎటు వెళ్తాయో తెలియని పరిస్థితి. ట్రాకర్సు మాత్రం ఆయా గ్రామాల్లో రైతులకు ఏనుగులు సంచారంపై అవగాహన కల్పిస్తూ సమాచారం అందిస్తున్నారు. అయితే ఏనుగుల తరలింపుపై శాస్వత పరిష్కారం చూపకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిందితుడికి జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఇంట్లో దొంగతనం చేసిన కాగిత అర్జున్‌కు అడిషనల్ జ్యుడిషియల్ ఫ్యామిలీ కోర్ట్ మెజిస్ట్రేట్ చక్రవర్తి 3 నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ అశోక్కుమార్ మంగళవారం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన కంది శ్రీనివాసరావు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం తలుపులు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆ మరుసటి రోజు ఇందిరానగర్కు చెందిన కాగిత అర్జున్‌ను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో చార్జ్‌షీట్ దాఖలు చేసి కోర్‌ోట్ల ప్రవేశ పెట్టామన్నారు. కేసు విచారణ చేసి పై విధంగా తీర్పునిచ్చారని ఎస్‌ఐ తెలిపారు.
భర్తతో గొడవపడి
వివాహిత ఆత్మహత్య
భువనగిరి టౌన్: భర్తతో గొడవపడి క్షణికావేశంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం నాయుడువలస గ్రామానికి చెందిన లచ్చుపాత్రుని లక్ష్మునాయుడు, లలిత(30) దంపతులకు 2018లో వివాహమైంది. జీవనోపాధి నిమిత్తం వారు ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. 2025లో భువనగిరి శివారు లోని ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీలో లక్ష్మునాయుడుకు ఉద్యోగం రావడంతో భువనగిరి పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో స్థిరపడ్డారు. వీరికి ఆరేళ్ల కుమారుడు అయినేంద్ర నాయుడు, ఒకటిన్నర ఏళ్ల కుమార్తె జోషిత ఉన్నారు. సోమవారం రాత్రి భోజనం చేసే సమయంలో భర్తతో లలిత గొడవపడింది. దీంతో మనస్తాపానికి గురైన లలిత భర్త పిలుస్తున్నా వినకుండా బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కాసేపటి తర్వాత లక్ష్మునాయుడు తలుపు తట్టగా లలిత స్పందించకపోవడంతో కిటికీలోంచి చూడగా.. ఆమె కబోర్డు హ్యాంగర్‌కు ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
పోలీసుల అదుపులో ఒడిశా వాసి
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో క్రైమ్ పార్టీ బృందం సెల్ ఫోన్‌లను దొంగతనం చేస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకుంది. దాదాపు 80సెల్‌ఫోన్‌లను అపహరించినట్టు క్రైమ్ పార్టీ బృందానికి వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ సురేంద్రనాయుడు అదుపులోకి తీసుకున్నారు.


