పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కాంస్య పతకం | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కాంస్య పతకం

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

చీపురుపల్లి రూరల్‌(గరివిడి): గరివిడి పట్టణానికి చెందిన క్రీడాకారిణి గణపతిరాజు శ్వేత పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. ఈ నెల 4,5 తేదీల్లో విజయనగరం జిల్లాలోని రాజాం జీఎంఆర్‌ ఐటీఓలో ఏపీ 13వ పవర్‌ లిఫ్టింగ్‌ 2026 చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. పోటీల్లో క్రీడాకారిణి శ్వేత మాస్టర్‌ వన్‌ విభాగంలో 76 కిలోల కేటగిరిలో 230 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకం కై వసం చేసుకున్నారు.

ఘాట్‌ రోడ్‌లో బియ్యం లారీ బోల్తా

పాచిపెంట: ఒడిశా నుంచి ఆంధ్రాకు బియ్యం లోడుతో వస్తున్న లారీ మండలంలో కంకణాపల్లి సమీపంలో ఘాట్‌ రోడ్‌పై మంగళవారం ఉదయం బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కొన్ని గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ అర్జున్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి క్రేన్‌తో లారీని పక్కకు నెట్టించారు. చెల్లాచెదురుగా ఉన్న బియ్యం బస్తాలను స్థానికుల సహాయంతో రోడ్డు పక్కకు వేసి ట్రాఫిక్‌ అంతరాయం తొలగించారు. దీంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.

బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

భామిని: సింగిడి నుంచి పసుకుడి వైపు బైక్‌పై వస్తున్న మండలంలోని పసుకుడికి చెందిన గౌడో ప్రసాద్‌, సోమనాథ్‌ సాహు మంగళవారం రాత్రి పసుకుడి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రం గా గాయపడ్డారు. బైక్‌పై వస్తున్న వీరు ఎదురుగా భామిని వైపు నుంచి వస్తున్న మరో బైక్‌ వెనుకభాగంలో ఉన్న బస్తాను చీకట్లో ఢీకొని పడిపోయారు. దీంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో భామిని పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement