తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

రూ.2 లక్షల నగదు

అపహరణ

పాచిపెంట: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన మండల కేంద్రం స్థానిక పాచిపెంట బీసీ కాలనీలో మంగళవారం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అనపర్తి రామారావు తన భార్య సత్యవతి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి ఉపాధి హామీ పనికి వెళ్లారు. అదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ తలుపులు విరగొట్టి ఇంటి లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఉపాధి హామీ పని నుంచి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి రామారావు భార్య సత్యవతి చీర కోసం బీరువా తెరిచి చూడగా బీరువా లోపల తలుపులు తెరిచి చీరలు, కాగితాలు చిందరవందరగా ఉన్నాయి. దీంతో తన ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన సత్యవతి స్థానికుల సహాయంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పార్వతీపురం నుంచి క్లూస్‌ టీమ్‌ని పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement