విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని అల్ట్రాసౌండ్ స్కాన్ గదిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనతో అక్కడ వైద్య సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అక్కడ సిబ్బంది సకాలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అల్ట్రాసౌండ్ స్కాన్ గదిలోని స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. విద్యుత్ నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. అదే వరుసలో ఉన్న సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, ఎక్సరే విభాగాలకు సేవలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.


