విజయనగరం అర్బన్: సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘గ్రీన్ బిల్డింగ్ ఇనిషియేటివ్’ అంశంతో ఐజీబీసీ స్టూడెంట్స్ చాప్టర్‌ను విశాఖపట్నం ఐజీబీసీ చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె.కుమార్‌రాజా మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్స్ బిల్టింగ్స్, సుస్థిరత సూత్రాలు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పాత్ర కీలకమని అన్నారు. కో–చైర్మన్ పీలా కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ఐజీబీసీ స్టూడెంట్స్ చాప్టర్ స్థాపన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పర్యావరణ హిత నిర్మాణ పద్దతులను ప్రోత్సహించడం, ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సుస్థిర అభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కళాశా ల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు అన్నారు. అనంతరం అసోసియేట్ కౌన్సిలర్ కేవీ శ్రీదత్త, మేనేజర్ పీవీ సత్యమూర్తి బృందం నిర్వహించిన ప్రజెంటేషన్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ, నీటి సంరక్షణ, పర్యావరణ హిత పదార్ధాల వినియోగం వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జి.రవికిశోర్, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


