● చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి
● మావిగన్‌తో రాష్ట్ర అభివృద్ధి
భామిని: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భూ దోపిడీకి తెరతీసింది. రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కొని వేల ఎకరాలను తమ డొల్ల కంపెనీలు, బినామీలకు కట్టబెట్టింది. వాటికి విలువ రావాలనే ఉద్దేశంతో అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో చూపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే డబ్బులు లేవని చెబుతున్న సీఎం చంద్రబాబు... రూ.2లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎప్పటికి అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. భామిని మండలం ఘనసరలో కార్యకర్తలతో మంగళవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధాని భూము ల్లో ఫాంహౌస్‌ల కేటాయింపుల్లో కూటమి నేతలు తలమునకలయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజధాని నాటకానికి తెరతీశారన్నారు. కేవలం రూ.20వేల కోట్లతో అభివృద్ధి చెందే అవకాశం ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) మధ్య రాజధాని ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. దీనిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. రైతులు శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రయత్నాలు చేయకపోవడం ప్రభుత్వానికి తగదన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారని వాపోయారు. మరోవైపు ఏనుగుల సమస్య రైతులను వెంటాడుతోందన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోని చంద్రబాబు సర్కారుపై ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బి.ధర్మారావు, బి.శ్రీనివాసరావు, ఎం.మోహన్‌బాబు, కె.చంద్రశేఖర్, జి.రమేష్, ఎ.రామినాయుడు, గిరిబాబు, ఎం.చలపతి, అగత ముడి రఘు, రాంప్రసాద్ సాహూ, రొక్కం ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.


