‘రన్‌ ఫర్‌ జీసస్‌’ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

‘రన్‌ ఫర్‌ జీసస్‌’ ర్యాలీ

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

విజయనగరం టౌన్‌: రన్‌ ఫర్‌ జీసస్‌ పేరిట క్రైస్తవ విశ్వాసులు నగరంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఈ ర్యాలీని వైఎస్సార్‌ సీపీ నాయకులు దేవుపల్లి చిట్టిబాబు, 47వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ పట్నాన పైడిరాజు కలిసి ప్రారంభించారు. లోక రక్షకుడు క్రీస్తు అని, ఆయన మరణాన్ని సైతం జయించి నిజమైన దేవుడిగా గుర్తింపు పొందారని ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పి.ప్రేమానందం తెలిపారు. ప్రపంచ శాంతికి, మానవాళి శ్రేయస్సుకు జీసస్‌ బోధనలు దోహదపడతాయని, ప్రతిఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షుడు బిషప్‌ ఎం.పాల్సన్‌, యూపీఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement