కృత్రిమ మేధస్సుతో భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధస్సుతో భవిష్యత్‌

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

గూగుల్‌ సంస్థ మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌ సౌమ్య

రాజాం సిటీ: కృత్రిమ మేధస్సు, మెషీన్‌ లెర్నింగ్‌ భవిష్యత్‌ ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని బెంగుళూరుకు చెందిన గూగుల్‌ సంస్థ మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌–2 బి.సౌమ్య అన్నారు. జీఎంఆర్‌ ఐటీ డీమ్డ్‌ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ డే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏఐ ఉద్యోగాలను తగ్గించదని, వాటి స్వభావాన్ని మార్చుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. విద్యార్థులు అవకాశాలను వినియోగించుకుని ఉద్యోగార్థులుగా కాకుండా క్రియేటర్స్‌గా రాణించాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ జె.గిరీష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రొగ్రామింగ్‌, డేటా స్ట్రక్చర్స్‌, గణితం వంటి మౌలిక అంశాలలో పట్టు సాధించాలన్నారు. అలాగే సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టీమ్‌ వర్క్‌ కూడా అవసరమేనని చెప్పారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. 1100 మందికి ఆఫర్లు రాగా 850 మంది వివిధ ఉద్యోగాల్లో నియమితులయ్యారని కెరీర్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌ సభ్యుడు కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌, డాక్టర్‌ ఏవీ రమణ, డాక్టర్‌ పి.రమణ, డాక్టర్‌ రవీంద్రనాథ్‌, డాక్టర్‌ శశికుమార్‌, డాక్టర్‌ గణేష్‌ ప్రభు, డాక్టర్‌ ఆర్‌ఎల్‌ నాయుడు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement