శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ జవహర్‌నవోదయ విద్యాలయలో మూడురోజులుగా నిర్వహిస్తున్న హైదరాబాద్ రీజియన్‌స్థాయి హ్యాండ్‌బాల్ మీట్ 2025–26 గురువారం ముగిసింది. ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ మీట్‌కు దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్లు యానాం, అదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గిల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారంతా మూడు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఏపీ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో యానాం క్లస్టర్ అత్యుత్తమ ప్రదర్శనతో 26బహుమతులు సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది. గురువారం సాయంత్రం ముగింపు వేడుకల్లో ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలను దిగ్విజయంగా పూర్తిచేసిన రిఫరీలు, కోచ్‌లు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, క్రీడాకారులకు ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు.