
మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం రూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో మిగులు సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ ఎస్. రూపావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్ కార్డుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్‌తో తమకు కావాల్సిన ప్రాంతంలో ఆయా పాఠశాలలను, కళాశాలను నేరుగా వెళ్లి సంప్రదించాలని కోరారు. బాలురుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో కొప్పెర్ల, బాడంగి, పాలకొండ, సాలూరు, జోగింపేటలో అదేవిధంగా బాలికలకు సంబంధించి చీపురుపల్లి, నెల్లిమర్ల, వేపాడ, వీఎంపేట, వంగర, గరుగుబిల్లి, కొమరాడ, భామిని పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సంబంధిత ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని సూచించారు.
జిల్లా కన్వీనర్ ఎస్ రూపావతి