
సీ్త్రనిధి రుణ లక్ష్యం రూ.283 కోట్లు
● సీ్త్రనిధి ఏజీఎం చిట్టిబాబు
రామభద్రపురం: జిల్లాలో మహిళా సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుకోసం సీ్త్రనిధి కింద రూ.283 కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏజీఎం వై.చిట్టిబాబు తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీఓఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు సద్వినియోగం చేసుకునేలా రుణాలు మంజూరు చేయాలని, వంద శాతం రికవరీ చేయాలని సూచించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 40 వేల డ్వాక్రా సంఘాలున్నాయన్నారు. ఇప్పటి వరకు సీ్త్రనిధి కింద రూ.89 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తామన్నారు. నూటికి నెలకు 92 పైసలు వడ్డీ పడుతుందన్నారు. సకాలంలో చెల్లిస్తే అధిక వడ్డీభారం ఉండదన్నారు. మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీ్త్రనిధి ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ రమేష్, ఏపీఎం మోహన్, సీసీ సింగరాజు, తదితరులు పాల్గొన్నారు.