
భలే వ్యాపారం!
పారల తయారీలో నిమగ్నమైన కమ్మర్లు
రేగిడి మండలంలోని వండానపేట... వ్యవసాయ పరికరాలకు ప్రసిద్ధి. గ్రామంలోని ఎనిమిది కమ్మరి వృత్తి కుటుంబాలు దశాబ్దాలుగా పంటల సాగుకు అనువైన, అవసరమైన పరికరాలు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఖరీఫ్, రబీ కాలాలు వస్తే చాలు.. వీరికి చేతినిండా పని దొరుకుతుంది. వీరు తయారు చేసే పారలు, కత్తులు, కొడవళ్లు, బొరిగిలు, కొంటె కర్రలకు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వరి ఉభాల్లో భాగంగా గట్లు తీతకు ఉపయోగించే పారలకు గిరాకీ నెలకొంది. వ్యా‘పార’ం జోరందుకుంది. ఒక్కో పారను రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. – రేగిడి

భలే వ్యాపారం!

భలే వ్యాపారం!