
ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏలో గిరిజన సంఘాలు, ప్రజా ప్రతినిధులతో ముందస్తు సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతీ, సంప్రదాయా లు ఉట్టిపడేలా వచ్చేనెల 9న సీతంపేటలో ఆదివాసీ దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్న ట్లు చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చే గిరిజను ల కోసం రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన నృత్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూదేవి, జేఏసీ నాయకులు బి.తేజేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయ ణ, అడవిరాముడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యారాణి, ఎంపీపీ బి.ఆదినారాయణ, ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబా బు, ఎస్సై వై.అమ్మన్నరావు పాల్గొన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు