
నవోదయలో హ్యాండ్‌బాల్ మీట్
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ మీట్ 2025–26ను ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్ల నుంచి వచ్చిన క్రీడాకారులు, ఆయా విద్యాలయాల కోచ్‌లను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాం, అదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గి క్లస్టర్ల నుంచి క్రీడాకారులు వచ్చినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలకు ఏపీ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు నేతృత్వం వహిస్తారని చెప్పారు. కట్టా శ్రీను, ఎన్‌వీవీ కుమార్‌లు రిఫరీలుగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లు బీహార్ రాష్ట్రంలోని నలందలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో హైదరాబాద్ రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. క్రీడాకారుల కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు.