
ఆటో, బైక్ ఢీ: వృద్ధుడి మృతి●
● మరో నలుగురికి తీవ్రగాయాలు
లక్కవరపుకోట: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో మంగళవారం కొత్తవలస నుంచి ప్రయాణికులతో ఆటో వస్తుండగా సోంపురం జంక్షన్ నుంచి మితిమీరిన వేగంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రంగరాయపురం జంక్షన్ సమీపంలో ఎత్తుబ్రిడ్జి వద్ద ఆటోను బలంగా ఢీకొట్డాడు. దీంతో ఆటో అదుపు తప్పి బొల్తా కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న కిత్తన్నపేట గ్రామానికి చెందిన యడ్ల సింహాచలం(64) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ బంగారయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బైక్ నడుపుతున్న వ్యక్తి పూర్తిగా మద్యం తాగి ఉన్నాడని ఎల్.కోట జంక్షన్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా వారిని చూసి సంబంధిత వ్యక్తి ఆగకుండా బండిపై వెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108 వాహనంలో ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ పాపారావు తెలిపారు.