
సారా తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
పాలకొండ: సారా నిర్మాలనలో భాగంగా సోమవారం చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. సీతంపేట మండలం దిగువ బుడగరాయి వద్ద దారి కాపలా కాయగా పాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక నవీన్ 20 లీటర్ల సారా, బుడగరాయి గ్రామానికి చెందిన సవర మంగయ్య 10 లీటర్ల సారా తరలిస్తూ పట్టబడినట్టు తెలిపారు. వారితో పాటు దిగువ బుడగరాయికి చెందిన పాత నేరస్తుడు సవర వెంకయ్యను అరెస్టు చేసి ముగ్గురిని కోర్టులో హజరు పరిచామని తెలిపారు. సారా తయారీకి ఉపయోగించే బెల్లం విక్రయాలు చేపడుతున్న వీరఘట్టం మండలానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. నవోదయం 2 కార్యక్రమంలో భాగంగా సారా అమ్మకాలు చేస్తున్న గ్రామాలపై నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.