ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌

Jun 14 2025 9:54 AM | Updated on Jun 14 2025 9:54 AM

ముగిస

ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌

రం, కురుపాం, కొమరాడ మండలాల సుదూర ప్రాంతాల స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురు మహిళా టీచర్లు ఆవేదన చెందారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ క్లస్టర్‌ ఖాళీలను ఉన్నతాధికారుల సూచనల మేరకు చివరి వరకు చూపించలేదన్నారు. మిగిలిన 152 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఖాకీల హడావిడిపై గురువుల గుర్రు

విజయనగరం క్రైమ్‌: డీఈఓ మాణిక్యంనాయుడు ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయ కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద సీఐ శ్రీనివాస్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐలు రామగణేష్‌, రమణ, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కౌన్సెలింగ్‌ కేంద్రంలో పోలీసుల హడావిడిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ లోపాలను విడిచిపెట్టి గురువులపై పోలీసులతో పెత్తనం సాగించాలని చూస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసినా చూపించిన క్లస్టర్‌ ఖాళీలు

2,300 మంది ఎస్జీటీలకు బదిలీ

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు.. నిరసనలు.. బైఠాయింపులు.. కౌన్సెలింగ్‌ కేంద్రంలో ఖాకీల హడావిడితో చివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాతిపదికన చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. 2,300 మంది ఎస్జీటీలకు మాన్యువల్‌ విధానంలో బదిలీచేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగినా ఉన్నతాధికారుల సూచనల మేరకు క్లియర్‌ వేకెన్సీలు మాత్రమే భర్తీ చేశారు. క్లస్టర్‌ ఖాళీలు చూపించలేదు. చివరి రోజు 1,001 నుంచి ప్రారంభించిన కౌన్సెలింగ్‌ చివరి నంబర్‌ వరకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అందరికీ సమాచారం ఇచ్చారు. ఒకే రోజు దాదాపు వెయ్యిమందిని పిలవడంతో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం పరిసరాలు ఉపాధ్యాయులతో సందడిగా మారాయి. తాజాగా ఉన్న ఖాళీ స్థానాలన్నిటినీ తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులు కోరుకోవడంతో, రిక్వెస్ట్‌ బదిలీల ఉపాధ్యాయులు అధికంగా తమ స్థానాల్లోనే ఉండిపోయేందుకు సుముఖత తెలిపారు. 1,400 సీరియల్‌ ప్రారంభ సమయానికి మైదాన ప్రాంత మండలాల స్కూల్స్‌లో పోస్టులన్నీ భర్తీ అయిపోయాయి. మిగిలిన ఉపాధ్యాయులు ఏజెన్సీ మండలాలైన జీఎల్‌పు

ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌ 1
1/1

ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement