
● బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అంజనీకుమార్
విజయనగరం క్రైమ్: తెలుగు వెలుగుల జ్యోతులు ప్రతిచోటా ప్రసరింపజేయాలని బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అంజనీకుమార్ కోరారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని గైట్ కళాశాలలో జనవరి 5,6,7 తేదీల్లో నిర్వహించనున్న రెండో ప్రపంచ తెలుగు మహాసభల కరపత్రాలను విజయనగరం జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాషా ఔన్యత్యాన్ని విరాజింపజేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి, సభ్యులు దాసరి పద్మ, రత్నాల బాలకృష్ణ, న్యాయవాదులు జి.రాంబాబు, ఎం.శ్రీనివాస్, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.