పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 పత్రాల జారీలో అధికార కుట్ర బైండోవర్లతో బెదిరింపులు

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం

శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
పత్రాల జారీలో అధికార కుట్ర

● వైఎస్సార్‌సీపీ ఆశావహులకు నో డ్యూ,

నామినేషన్‌ పత్రాలు ఇవ్వని వైనం

● గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి

కమిషనర్ల తీరుపై సర్వత్రా విమర్శలు

● వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే

లక్ష్యంగా వేధింపులు

● బెండోవర్లతో పోలీసుల బెదిరింపులు

దాచేపల్లి: అధికారుల ద్వారా కూటమి నేతలు ఒత్తిడి చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆశావహులకు పత్రాలు ఇవ్వకుండా కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు వేయాలని ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న 24గంటల లోపే సంబంధిత పత్రాలన్నీ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై వివక్ష చూపుతున్నారు. గురువారం రాత్రి 9 గంటలైనా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసే వారికి నో డ్యూస్‌ సర్టిఫికెట్లు, నామినేషన్‌ పత్రాలు దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్లలో ఇవ్వకుండా కావాలనే తాత్సారం చేస్తున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల మున్సిపాలిటీ, నగర పంచాయతీ కమిషనర్లు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.

వివాదాస్పదంగా నామినేషన్ల కేంద్రాలు

గురజాల నియోజకవర్గంలో నామినేషన్‌ కేంద్రాల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో 28 వార్డులకుగాను 12 వార్డులు నగర పంచాయతీ కార్యాలయంలో, మిగిలిన 16 వార్డులు నడికుడి వార్డు సచివాలయంలో నామినేషన్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం, నారాయణపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మాత్రమే నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నడికుడిలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రం పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్‌ కేంద్రాన్ని నారాయణపురం మార్చాలని వినతిపత్రం అందజేశారు. నగర పంచాయతీ కమిషనర్‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నామినేషన్‌ కేంద్రాన్ని మార్చలేదు. పైగా దాచేపల్లిలోని 13,14 వార్డుల నుంచి నామినేషన్లు నడికుడిలోనే వేసేలా చర్యలు తీసుకున్నారు. కమిషనర్‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా గురజాల నగర పంచాయతీలో కూడా దూబా చెరువు వద్ద ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో నామినేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో తహసీల్దార్‌ కార్యాలయం, ఆర్‌డీవో కార్యాలయం, నగర పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్లు వేయటం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఆదిలోనే అడ్డుకునేలా దూబా చెరువు వద్ద ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఈసారి ఎంపిక చేశారు. ఇక్కడ నామినేషన్లు వేసేందుకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దూబా చెరువు వద్ద పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయవద్దని వైఎస్సార్‌సీపీ నేతలు గురజాల నగర పంచాయతీ కమిషనర్‌ను కలిసి చెప్పినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో నామినేషన్ల ప్రక్రియకు కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.

జి.వెంకటేశ్వర్లు, దాచేపల్లి కమిషనర్‌

ఐ. శ్రీనివాసులు,

పిడుగురాళ్ల కమిషనర్‌

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.8780 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. గురజాల నియోజకవర్గ పరిధిలో గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లిలో జరిగే మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్‌లతోపాటుగా నామినేషన్‌ ఫారాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులు పనిచేస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు బైండోవర్లు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారు. పిడుగురాళ్ల 275, దాచేపల్లి 285, గురజాల 70 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు బైండోవర్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బైండోవర్‌ పేరుతో పోలీస్‌స్టేషన్‌కి పిలిచించి, ఎన్నికల్లో పోటీ చేస్తే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై మాత్రమే బైండోవర్లు పెట్టి స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారు. దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్లలో ఈ పరిస్థితి ఉంది. నామినేషన్ల దాఖలు ప్రారంభమైతే పోలీసుల నుంచి ఒత్తిడి మరింతగా ఉంటుందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగకుండా తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement