కనకదుర్గమ్మకు సారె సమర్పణ | - | Sakshi
Sakshi News home page

కనకదుర్గమ్మకు సారె సమర్పణ

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

కనకదుర్గమ్మకు సారె సమర్పణ తాడేపల్లి రూరల్‌: విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాడేపల్లి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం నుంచి గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించారు. పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్నజీయర్‌స్వామి మంగళా శానసనాలతో విజయకీలాద్రి దివ్యక్షేత్ర ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, రఘునాథాచార్యులు, ఆలయ అర్చక బృందం అనంతస్వామి, శ్రీనివాస్‌ సుదర్శన స్వామి, శ్రీనివాస సంతోష స్వామి, నల్లూరి కృష్ణలతోపాటు వేదవిద్యార్థులు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. విజయకీలాద్రి దివ్యక్షేత్రం నుంచి కనకదుర్గమ్మ వారికి సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, వెంకటేశ్వరస్వామి వారు కనకదుర్గమ్మ వారిని తన సోదరిగా భావిస్తారనే సంప్రదాయ విశ్వాసానికి ప్రతీకగా ఈ సారె సమర్పణ మహోత్సవం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. జయలక్ష్మి అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై జయలక్ష్మి అమ్మవారికి గురువారం అభిషేకం, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు జయలక్ష్మి అమ్మవారికి అభిషేక మహోత్సవం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి శ్రీయాగం వైభవంగా జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, జయలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొనసాగిన అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన ఏపీ హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడిగా భాస్కర్‌

నగరంపాలెం: నగరంలోని గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన పక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం చేబ్రోలు మండల పరిధిలోని బాండ్లను పరిశీలించారు. మండల పరిధిలోని 156 మంది డిపాజిట్‌దారులు హాజరయ్యారు. ఈ మేరకు వారి నుంచి 226 అగ్రిగోల్డ్‌ బాండ్లను పరిశీలించినట్లు ప్రాంతీయ కార్యాలయపు ఏఎస్పీ బి.సీతారామయ్య తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో చేబ్రోలు, కాకుమాను, పెదనందిపాడు మండలాల పరిధిలోని అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన (అగ్రిగోల్డ్‌ బాండ్లల్లోని చిరునామాల ఆధారంగా) ఉంటుందని అన్నారు. ఆయా మండలాల్లోని అగ్రిగోల్డ్‌ బాండ్‌ దారులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. ఒరిజినల్‌ బాండ్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, సంబంధిత పత్రాల నకళ్లు వెంట తీసుకుని రావాలని తెలిపారు.

నగరంపాలెం: ఏపీ హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షునిగా కె.భాస్కర్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం తాలుకా ఆవరణలోని పెన్షనర్స్‌ భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. హ్యూమన్‌ రైట్స్‌ జాతీయ కార్యదర్శి జె.శ్రీనిలత, జాతీయ వ్యవస్థాపకులు దాస్‌ హాజరయ్యారు. అనంతరం భాస్కర్‌ను పలువురు సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది లక్ష్మీశైలజాగౌడ్‌, వాకర్స్‌ చెలికాని సీతారామయ్య, విశ్రాంత ఎస్పీ అశోక్‌బాబు, అర్బన్‌ బ్యాంక్‌ డైరక్టర్‌ భాస్కరరావు, మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జోన్నలగడ్డ వెంకటరత్నం, తెలంగాణ హ్యూమన్‌రైట్స్‌ అధ్యక్షుడు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement