అధికార పక్షం.. అరాచకపర్వం | - | Sakshi
Sakshi News home page

అధికార పక్షం.. అరాచకపర్వం

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

అధికార పక్షం.. అరాచకపర్వం

అక్కసుతో దాడులు...

మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వరుస దాడులు

ఇవిగో నిదర్శనాలు

సాక్షి, నరసరావుపేట: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి ప్రజలు బ్రహ్మారథం పట్టారు. భారీ ఎత్తున హాజరై వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ర్యాలీని భగ్నం చేసేందుకు అధికారపార్టీ నేతలు పోలీసులను వినియోగించారు. సభకు అనుమతివ్వలేదు. ర్యాలీ జరుగుతున్న సమయంలో చిన్న డీజే వాహనాన్ని పెట్టుకుంటామని దరఖాస్తు చేసుకున్నా అంగీకరించలేదు. వాహనాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి యజమానిని కోర్టులో ప్రవేశపెట్టారు. బారికేడ్లు పెట్టి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు రాకుండా కుట్రలకు పాల్పడ్డారు. ఇంత చేసినా ప్రజాభిమానంతో వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం విజయవంతమైంది.

● పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన మాచర్ల పట్టణంలో జరిగిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీకి వెళ్లిన రెంటచింతల మండలం మంచికల్లు పార్టీ నాయకులు పాశం వెంకటరెడ్డిపై అదే రోజు టీడీపీ వర్గీయులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డిని వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నరరావుపేటకు తీసుకెళ్లారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన పింగళి వెంకట రామిరెడ్డితో ద్విచక్ర వాహనంపై కలసి ర్యాలీకి వెళ్లి వచ్చి సెంటర్లో కూర్చున్న తనపై టీడీపీ నేతలు కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపారు.

● మాచర్ల పట్టణం నెహ్రూనగర్‌లోని వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతిపరుడు తమ్మిశెట్టి శ్రీహరి కుటుంబంపై ఈ నెల 21న అర్ధరాత్రి టీడీపీ మూకలు దాడి చేశాయి. ఆ దాడిలో శ్రీహరి కాళ్లు విరగ్గొట్టారు. అలాగే ఆయన బంధువు మంగమ్మ చేయి విరగ్గొట్టారు. వైఎస్సార్‌సీపీ సభలో పాల్గొనడంతో కక్షగట్టిన టీడీపీ గూండాలు అర్ధరాత్రి విచక్షణరహితంగా దాడి చేయడంతో నరసరావుపేట ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కేసు నమోదు చేయకుండా టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదుతో ఏకంగా బాఽధితులపైనే కేసు నమోదు చేయడం విశేషం.

● మాచర్ల పట్టణ 17వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు పగిడిబోయిన ఇంద్రసేన గౌడ్‌పై టీడీపీ గూండాలు మంగళవారం కత్తులతో దాడి చేశారు. ఇంద్రసేన గౌడ్‌ వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా ఉండటంతోపాటు మొన్న జరిగిన వైఎస్సార్‌సీపీ ర్యాలీలో యాక్టివ్‌గా పాల్గొన్నారు.

● మాచర్ల రూరల్‌ మండలం కంభంపాడు గ్రామం మీదుగా వెళ్తున్న హైవేలో వీఽధి లైట్లు వెలగకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పార్టీలకు అతీతంగా ఈ నెల 14న నిరసన వ్యక్తం చేశారు. అక్కసుతో ఉన్న అధికారపార్టీ నేతలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న నెపంతో కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపైనే కేసు నమోదు చేయించారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయంలో మధ్యవర్తిత్వం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లపైనా కేసు నమోదు చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారనే కోపంతోనే కేసులో ఇరికించారని వాపోతున్నారు.

మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీ విజయవంతంపై తీవ్ర చర్చ నడవడంతో ఎలాగైనా సత్తా చూపాలని గత శుక్రవారం టీడీపీ రెండేళ్ల విజయోత్సవ సభ నిర్వహించింది. దీన్ని విజయవంతం చేయడానికి ఉపాధి హామీ, డ్వాక్రా మహిళలను ప్రత్యేకంగా వాహనాలు పెట్టి తరలించారు. 8 డీజే వాహనాలు, రోడ్డుకు అడ్డంగా స్టేజ్‌ నిర్మించారు. ఇన్ని చేసినా వైఎస్సార్‌సీపీ ర్యాలీకి మించి విజయవంతం కాకపోవడంతో అఽధికార పార్టీలో తీవ్ర అసహనం రేగింది. దీంతో వైఎస్సార్‌సీపీ ర్యాలీకి హాజరైన వారిపై మూకుమ్మడి దాడులకు దిగుతున్నారు. బాధితులపైనే పోలీసులతో అక్రమ కేసులు కట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు.

12న వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన

వెన్నుపోటు సభ భారీ సక్సెస్‌

చంద్రబాబు ప్రభుత్వం, ఎమ్మెల్యే

జూలకంటిపై వ్యతిరేకతతో భారీగా

హాజరైన ప్రజలు

వెఎస్సార్‌సీపీకి పోటీగా తలపెట్టిన

టీడీపీ రెండేళ్ల విజయోత్సవ

సభ విఫలం

వెన్నుపోటు సభకు వచ్చిన వైఎస్సార్‌సీపీ

క్యాడర్‌పై అక్కసుతో వరుస దాడులు

రెండేళ్ల టీడీపీ పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని జీర్ణించుకోలేని మాచర్ల అఽధికారపార్టీ నేతలు దాడులు, అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై విరుచుకుపడుతున్నారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు పొడిచిన వెన్నుపోటులపై వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 12వ తేదీన పిలుపునిచ్చిన నిరసన ర్యాలీ మాచర్ల పట్టణంలో విజయవంతమైంది. అధికారం చేపట్టిన రెండు సంవత్సరాలలోనే చరిత్రలో ఎన్నడూలేనివిధంగా చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పోకడలతో అది మాచర్లలో మరింత ఎక్కువగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement