బ్యాంకుకు సమకూరిన రూ.1836 కోట్ల నికర ఆదాయం 1359శాఖలతో 1.30 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు ఏపీ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోదకుమార్‌రెడ్డి
నరసరావుపేట: నికర ఆదాయం రూ.1836కోట్లతో ఏపీ గ్రామీణ బ్యాంక్ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడిందని బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోదకుమారరెడ్డి చెప్పారు. స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఖాతాదారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1359 శాఖలతో 1.30కోట మంది ఖాతాదారులకు సేవలందిస్తున్నామని తెలియజేశారు. 13 లక్షల మంది రైతులకు 3.20లక్షలు స్వయం సహాయ సంఘాలకు రుణాలు అందిస్తున్నామని, అలాగే అన్ని రకాల అవసరాలకు బ్యాంకులో అనువైన రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ రుణ పథకాల గురించి బ్యాంకులో అందుబాటులో ఉన్న డిపాజిట్ పథకాల గురించి ఖాతాదారులకు నేరుగా తెలియజేసే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో క్రెడిట్ ఔట్రిచ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నరసరావుపేట ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ప్రతినెల ఎంతమంది కొత్త రైతులకు పంట రుణాలు అందిస్తే అన్ని మొక్కలు నాటాలి అన్న ఉద్దేశంతో సంకల్పించిన కేసిసి గ్రీన్ గ్రోత్ డ్రైవ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రెడిట్ జీఎం కల్లూరు జనార్దనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యాంకు పరిధిలో ఉన్న అన్ని కుటుంబాలను ఆర్థిక పరిపుష్టం చేసే దిశగా అనేక రుణ పథకాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. తొలుత కొంతమంది ఖాతాదారులు మాట్లాడుతూ బ్యాంకు సేవలను కొనియాడారు. రుణ మంజూరు విషయంలో ఖాతాదారులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని బ్యాంక్ చైర్మన్‌స్పష్టం చేశారు. వివిధ రంగాలకు చెందిన లబ్ధిదారులకు రూ.55కోట్ల రుణాలు, మరికొందరికి వివిధ వాహనాల తాళాలు అందజేశారు. డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, ఎల్‌డీఎం కేఎస్‌ఆర్ ప్రసాద్, నరసరావుపేట రీజినల్ మేనేజర్ పి.సుభాష్, బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.


