
ప్రపంచ జంప్‌రోప్ పోటీలకు తెనాలి బాలిక
తెనాలి: జపాన్‌లో జూలై 25వ తేదీ నుంచి జరుగుతున్న వరల్డ్ జంప్‌రోప్ చాంపియన్‌షిప్–2025లో స్థానిక వెస్ట్‌బెర్రీ స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.యుక్తాశ్రీ తలపడుతోంది. ఇంటర్నేషనల్ జంప్ రోప్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతాయి. వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ తరఫున యుక్తాశ్రీ జట్టులోకి ఎంపికై ందని స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం అన్నారు. గతేడాది నేపాల్‌లో ఇటీవల జరిగిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ యుక్తాశ్రీ సత్తా చాటింది. ఎల్‌ఆర్‌ఎస్ గ్రూప్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని పొందింది. 20 సెకన్ల డబుల్ అండర్ ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఉత్సాహంగా
జూడో పోటీలు
మంగళగిరి: మండలంలోని యర్రబాలెం డాన్‌బాస్కో స్కూలులో ఆదివారం జిల్లా స్థాయి జూడో పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా జూడో అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఎం.గురుతేజ (30 కేజీల విభాగంలో), డి.రేవంత్‌బాబు (35), జి.ప్రసాద్(40), ఎస్.యశ్వంత్ (45), సీహెచ్ లక్ష్మి (50), పి.నాగచరణ్ (55), కె. గౌతమ్ (60), పి.నాగచరణ్ (65), కె.దుర్గాప్రసాద్, టి. ఫ్రాన్స్‌జాకబ్ (66), ఎస్. దివ్యశ్రీ, (38), ఎం.ప్రశాంత్ దయ(32), సీహెచ్ శివనాగజ్యోతి (36), డి.పార్వతి (40), పి.పావని (44), ఎస్‌కే అప్సన (48), టి.విజయలక్ష్మి (52), వై,అమూల్య, జి.మధురిమ (57 కేజీల విభాగం)లో విజయం సాధించారు. ఈ మేరకు సంఘ అధ్యక్షుడు ఎ. శ్రీహరి నాయుడు తెలిపారు. కార్యక్రమంలో బి.కిరణ్, పీఈటీ రాజు, కోచ్ నాగదుర్గ, కిరణ్ కుమార్, జి.సాంబశివరావు, సబ్ జూనియర్ సెలెక్టెడ్ స్టేట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ జంప్‌రోప్ పోటీలకు తెనాలి బాలిక

ప్రపంచ జంప్‌రోప్ పోటీలకు తెనాలి బాలిక